విద్యుత్ వెలుగులతో గంగానమ్మ దేవాలయం

64చూసినవారు
విద్యుత్ వెలుగులతో గంగానమ్మ దేవాలయం
కృష్ణాజిల్లా కోడూరు గ్రామంలోని శ్రీ గంగానమ్మ తల్లి జాతర మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని విద్యుత్ వెలుగులతో బుధవారం అలంకరించారు. ఆలయ ధర్మకర్త కోట యుగంధర్ రావు పర్యవేక్షణలో ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేయడంతోపాటు భక్తులకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు. వేలాదిమంది భక్తులు జాతర మహోత్సవంలో పాల్గొని అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకున్నారు. విద్యుత్ కాంతులతో దేవాలయం నూతన శోభను సంతరించుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్