సనాతన ధర్మాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనపై ఉంది

83చూసినవారు
సనాతన ధర్మాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనపై ఉందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం రాత్రి కోడూరు మండలం ఉల్లిపాలెంలోని శ్రీమన్నారాయణ స్వామి వారి దేవాలయంలో సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామాల్లో కులమతాలకు అతీతంగా కలిసి మెలిసి ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్