మోపిదేవి: పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే

64చూసినవారు
మోపిదేవిలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్టి మహోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కుటుంబ సభ్యులు పాల్గొనగా, స్వామివార్లకు ఎమ్మెల్యే పట్టువస్త్రాలు సమర్పించారు. వేద పండితులు వేద మంత్రోచ్ఛారణల నడుమ స్వామివారికి వస్త్రాలను సమర్పించి పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె గావించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీరామ వరప్రసాద్ పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్