గన్నవరం నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ మంగళవారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2025 ప్రజల ఆనందాల సంవత్సరం కావాలని, ప్రతి ఇంటా నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని, సంపద, సమృద్ధి కలగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టమని మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే విధంగా కృషి చేస్తానని తెలిపారు.