విశ్వహిందూ పరిషత్తు ఆధ్వర్యంలో గన్నవరం మండలం కేసరపల్లిలో ఆదివారం నిర్వహించనున్న హైందవ శంఖారావం బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యఅతిథులుగా వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షులు అలోక్‌కుమార్, అయోధ్య రామమందిరం ట్రస్టీ గోవింద్‌దేవ్ మహరాజ్, వీహెచ్‌పీ కార్యనిర్వాహక కార్యదర్శి మిలింద్ పరందే, జాయింట్ సెక్రటరీ కోటేశ్వరశర్మ తదితరులతోపాటు రాష్ట్రంలో 150 మంది స్వామీజీలు పాల్గొననున్నారు.