విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వంతో పాటు స్వచ్చంద సంస్థలు కూడా అండగా ఉండాలని గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావ్ పేర్కొన్నారు. మంగళవారం గన్నవరం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ గోడౌన్ ప్రాంగణంలో విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ కృష్ణజిల్లా ఆధ్వర్యంలో 154 మంది విభిన్న ప్రతిభావంతులకు హిందుస్థాన్ ఏరోనాటికల్ సంస్థ సహకారంతో సుమారు 27, 14, 840 రూపాయల విలువ చేసే ఉపకరణాలు అందచేశారు.