టిడ్కో కాలనీలో ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. కాలనీలో సమస్యల పరిష్కారంపై మంగళవారం మున్సిపల్, టిడ్కో అధికారులతో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సమావేశమయ్యారు. గత పాలకుల తప్పిదాలతో టిడ్కో కాలనీలో చిక్కు ముడులతో కూడిన సమస్యలు నెలకొన్నాయని శాసనసభ్యులు రాము తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడివాడ మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.