జగ్గయ్యపేట పట్టణం చెరువు బజార్, కట్ట మీద ఆంజనేయస్వామి గుడి సమీప కాలనీలో గురువారం రాత్రి గాలి వాన దెబ్బకు చెట్టు విరిగిపోయి ఏపి-39-ఇఎ-6357 మారుతి ఆల్టో కారు పూర్తిగా ధ్వంసం అయింది. కారు యజమాని సూరబోయిన ఆదాం మత్స్య వృత్తి కుటుంబానికి చెందడంతో కారు ధ్వంసం అవ్వడంతో లబోదిబోమన్నారు. కారు పూర్తిగా టాప్, బాడీ, డోర్లు, అద్దాలు పూర్తి డ్యామేజి కాగా ఇంజన్ సైడ్ కూడా ధ్వంసానికి గురైన్నట్లు కనబడుతుంది.