జగ్గయ్యపేట పట్టణం పరిధిలోని పద్మావతి నగర్ లో బుధవారం ఓ బాలుడిపై వీధి కుక్క దాడి చేసింది. ఈ దాడిలో ఆ బాలుడికి స్వల్ప గాయాలు కాగా గమనించిన స్థానికులు వెంటనే అతడిని మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం స్థానికులు మాట్లాడుతూ ఆదే కుక్క నిన్న ఒకరిని, నేడు బాలుడిని వెంటపడి కరిచిందని చెప్పారు. మున్సిపాలిటీ అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.