శానిటేషన్ పై పూర్తిస్థాయిలో కొత్త విధానాన్ని తీసుకురావాలని జగ్గయ్యపేట మున్సిపాలిటీ ఐదవ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ వట్టెం మనోహర్ విజ్ఞప్తి చేశారు. గురువారం జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ పురపాలక సంఘ అధికారులు, వార్డ్ సెక్రటరీల సమీక్ష సమావేశంలో వట్టెం మనోహర్ పాల్గొన్నారు. ప్రజల సమస్యలపై పోరాడే కౌన్సిల్ సభ్యులకు వారి వార్డులలో అధికారులు అందుబాటులో ఉండే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు.