జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ కృషి ఫలించింది. బాలుడి వైద్యానికి ప్రభుత్వం బుధవారం 10 లక్షలు మంజూరు చేసింది. ఇటీవల వచ్చిన వరదల కారణంగా కొత్త భవదీప్ అనే బాలుడి కాలు పూర్తిగా తొలగించటంతో రెండో కాలుకు ఇన్ఫెక్షన్ రావడం జరిగింది. వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ముందస్తు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు బాలుడు వైద్యానికి 10 లక్షలు మంజూరు చేశారు.