కొల్లేరుకు రెగ్యులేటర్ల నిర్మాణం వెంటనే చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం ఏలూరు రూరల్ మండలం పరిధిలోని కలకుర్రు సమీపంలో పెదఎడ్లగాడి వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు కొల్లేరును పరిశీలించారు. కొల్లేరు భూములు ఉప్పు నీటి కయ్యలుగా మారకుండా చర్యలు చేపట్టాలని, కొల్లేరు వరదతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు.