కైకలూరు నియోజకవర్గంలో త్రాగునీరు, రోడ్లు, గృహనిర్మాణం, వివిధ శాఖల ప్రగతి, నియోజకవర్గంలో పలు సమస్యల పరిష్కారానికి తీసుకోవలసిన సమస్యలపై రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణం రాజు, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గురువారం తహసీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలు గురించి చర్చించారు.