అద్దె భవనంలో కొనసాగుతున్న మండవల్లి శాఖ గ్రంథాలయానికి స్థలం కేటాయించి నూతన భవన నిర్మాణానికి అధికారులు సహకరించాలని ప్ర. ప. ఐక్యవేదిక ఏలూరు జిల్లా కన్వీనర్ ఎల్. ఎస్. భాస్కరరావు అన్నారు. శనివారం గ్రంథాలయం వద్ద వారు మాట్లాడుతూ మండవల్లి గ్రంథాలయం ఎన్నో ఏళ్లుగా అద్దె భవనాలలో కొనసాగుతుందని, ప్రస్తుతం కొనసాగుతున్న అద్దె భవనంలో పుస్తకాలు బద్రపరిచేందుకు, రీడింగ్ రూమ్ కి సరిపడా గదులు లేవన్నారు.