మచిలీపట్నం నగరంలో తడి, పొడి చెత్త నిర్వహణ సక్రమంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ అధికారులను ఆదేశించారు. మచిలీపట్నం కలెక్టరేట్‌లో తన చాంబర్ లో జిల్లా కలెక్టర్ మంగళవారం సాయంత్రం నగర కమిషనర్, పారిశుద్ధ్య నిర్వహణ నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మచిలీపట్నం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు సమిష్టిగా కృషి చేయాలన్నారు.