ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదుకి శుభాకాంక్షల వెల్లువ

74చూసినవారు
ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదుకి శుభాకాంక్షల వెల్లువ
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మహాకూటమి నుంచి మైలవరం నియోజకవర్గ శాసనసభ్యునిగా ఎన్నికైన వసంత కృష్ణప్రసాదుకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పలు సంఘాల పెద్దలు, వసంత అభిమానులు ఐతవరంలోని ఎమ్మెల్యే స్వగృహానికి తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంచుకున్నారు. పుష్ప గుచ్ఛాలు అందజేసి, శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్