పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ

388చూసినవారు
పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ
ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం రెడ్డిగూడెం గ్రామం దళితవాడలో "ఫ్రెండ్స్ సర్వీస్ సొసైటీ" స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు విజయ్ కుమార్ చాట్ల ఆధ్వర్యంలో ఆదివారం నాడు విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో మరికొన్ని నోటు పుస్తకాలను పంపిణీ చేస్తామని తెలిపారు. గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ట్యూషన్ చెప్పడం, వివిధ పాఠశాలల్లో ప్రవేశం కొరకు జరిగే పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడం, వారాంతపు పరీక్షలు నిర్వహించి వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇవన్నీ కూడా ఉచితంగానే చేస్తున్నామని తెలిపారు. పేదలైన విద్యార్థులకు తమ వంతుగా తగిన సహాయ సహకారాలు అందించడం తమ కర్తవ్యంగా బావిస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్