మైలవరం కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్

1106చూసినవారు
మైలవరం కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్
మైలవరం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి బొర్రా కిరణ్ సోమవారం తన నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ర్యాలీగా వెళ్లి నామినేషన్ అధికారులకు అందజేశారు. మైలవరం ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్వోకు ఈ మేరకు తన నామినేషన్ అందించారు. తనకు ఒక అవకాశం ఇచ్చి గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్, సిపిఎం నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్