చాట్రాయి: రౌడీ షీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్

65చూసినవారు
చాట్రాయి: రౌడీ షీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్
చాట్రాయి పోలీస్ స్టేషన్ నందు రౌడీ షీటర్లకు ఎస్సై రామకృష్ణ ఆదివారం వ్యక్తిగతంగా, సామూహికంగా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ కౌన్సిలింగ్ లో భాగంగా రౌడీ షీటర్లందరూ సత్ప్రవర్తన కలిగి ఉండాలని, ఎలాంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనకూడదని, సమాజంలో శాంతి సామరస్యాలకు విఘాతం కల్పించకూడదన్నారు. మంచి నడవడిక కలిగి ఉండి సత్ప్రవర్తన కలిగున్న రౌడీషీట్లను తొలగించడానికి పై అధికారులకు వారి పేర్లను పంపిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్