నూజివీడు పట్టణంలో బంగారం చోరీ

75చూసినవారు
నూజివీడు పట్టణంలో బంగారం చోరీ
నూజివీడు పట్టణంలోని ఎంప్లాయిస్ కాలనీలో నివసిస్తున్న పాముల వెంకటరత్నం ఇంటిలో దుండగులు బీరువా బద్దలు కొట్టి బంగారు నగలు దొంగిలించారు. సంక్రాంతి పండగ సందర్భంగా వారు గన్నవరం వెళ్లారు. తిరిగి గురువారం సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించారు. బీరువాలోని బంగారు నగలు దొంగిలించినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్