నూజివీడు పట్టణంలోని ఎంప్లాయిస్ కాలనీలో శనివారం పట్టపగలు భారీ చోరీ చోటుచేసుకుంది. కాలనీలో నివాసం ఉండే వల్లభనేని రామకృష్ణ ఇంట్లో దొంగలు పడి 25 కాసుల బంగారు నగలు, 5 కేజీల వెండి ఆభరణాలు, 50వేల రూపాయల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. గడ్డ పలుగుతో తలుపు తాళం పగలగొట్టి లోపలికి జొరబడి దోచుకున్నారు. ఆ సమయంలో ఇంటి యజమాని, కుమారుడు జంగంగూడెం వెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.