శ్రావణ శుక్రవారం సందర్భంగా నూజివీడు పట్టణంలోని శ్రీ కోట మహిషాసుర మర్దిని అమ్మవారి ఆలయానికి భక్తులు శుక్రవారం పోటెత్తారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, పూలు, గాజులు, చీర తో సారె, ప్రసాదాలు సమర్పించి ప్రత్యేక పూజలు భక్తులు నిర్వహించారు. భక్తులకు ప్రసాదాలు సౌకర్యాలు అందజేశారు. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకున్నందుకు తరలివచ్చారు.