నూజివీడు - ముసునూరు రోడ్డు పై ఒరిగిన అతి పెద్ద వృక్షం

1032చూసినవారు
నూజివీడు - ముసునూరు రోడ్డు పై ఒరిగిన అతి పెద్ద వృక్షం
ముసునూరు మండలం చింతలవల్లి గ్రామంలో సుమారు 150 సంవత్సరాల అతిపెద్ద వృక్షం ఆదివారం వేర్ల తో సహ నేలకొరిగింది. దీంతో పరిసర ప్రాంత ప్రజలు ఈ దృశ్యాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు. ఎటువంటి గాలి, దుమ్ము లేకుండా వేసవి ఎండలో ఈ చెట్టు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో నూజివీడు-ముసునూరు ప్రధాన రహదారి పై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పక్కనే ఉన్న రేకుల షెడ్ పై కొన్ని కొమ్మలు విరిగిపడ్డాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్