తోట్లవల్లూరు మండలంలోని వరద బాధిత పునరావాస కేంద్రాలలో వర్షపోషకులకు పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా ఆధ్వర్యంలో గురువారం దాణా, వరిగడ్డి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇటీవల కృష్ణా నదికి వచ్చిన వరదల్లో సర్వం కోల్పోయి పునరావాస కేంద్రాలకు చేరిన వరద బాధితుల జాబితాను తీసుకుని పశుపోషకులకు అందరికీ అల్పాహారం భోజన సదుపాయం కార్యక్రమం నిర్వహించారు.