పెడన మండలం చోడవరం, నేలకొండపల్లి గ్రామాల ఆయకట్టులోని సుమారు 1. 77 హెక్టార్ల రెవెన్యూ భూమి అక్రమణకు గురైందని రెండు గ్రామాల రైతులు శుక్రవారం చోడవరంలో నిర్వహించిన రెవిన్యూ సదస్సులో తహశీల్దార్ అనిల్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఆక్రమణల వలన రైతులు తమ పొలాల సాగు చేసుకోవటానికి నానా అవస్థలు పడుతున్నామన్నారు. ఈ సమస్యను పరిష్కరించి తమ పొలాలకు రహదారి కల్పించాలని రైతులు తహశల్దార్ ను కోరారు.