పెడన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కష్టపడిన తోట వేణును విజయవాడ ఇంద్రకీలాద్రి- 2024 దేవి శరన్నవరాత్రి ఉత్సవాల కమిటీలో సభ్యుడిగా స్థానం దక్కింది. 53 మందితో ఏర్పాటైన కమిటీలో పేరు ఉండడంతో కూటమి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గురువారం వేణు మాట్లాడుతూ, తనకు అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ కు కృతజ్ఞతలు తెలిపారు.