కంకిపాడు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థినిగా జనసేన తరపున పోటీ చేసిన రేమళ్ళ సంపూర్ణమ్మ శనివారం తుది శ్వాస విడిచింది. కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సంపూర్ణ' ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. సంపూర్ణమ్మను నూతనంగా కంకిపాడు వ్యవసాయ మార్కెట్ యార్డు 'డైరెక్టర్ గా పేరు ప్రతిపాదించారు. సంపూర్ణమ్మ మృతి పట్ల పలువురు జనసేన పార్టీ నాయకులు సంతాపం ప్రకటించారు.