ఎన్టీఆర్ జిల్లా: గంపలగూడెం మండలం కనుమూరు గ్రామ శివారులో నాటుసారా తయారీ స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు ఆదివారం మధ్యాహ్నం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 600 లీటర్ల పులిసిన బెల్లం ఊటను తిరువూరు ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. ఎక్సైజ్ అధికారులకు రాబడిన సమాచారం మేరకు ఈ దాడి నిర్వహించడం జరిగిందని తెలిపారు. నాటు సార పై పోలీసులు కొరడా విధించారని, ఎవరైనా ఇలాంటి వాటికి పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.