పెనుగొలను లో ఆదివారం షిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో అమరవీరుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్య్రం కోసం ఉరి కంబం ఎక్కిన భగత్ సింగ్, సుఖౌదేవ్, రాజ్ గురు చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. ఉరి తాళ్లనే ఉయ్యాలగా భావించి అమరులైన వీరి త్యాగ నిరతని, దేశభక్తిని నేటితరం యువకులు ఆదర్శంగా తీసుకోవాలని పలువురు పిలుపునిచ్చారు.