ఎన్టీఆర్ జిల్లాలోని మున్సిపల్ కమిషనర్ల సమావేశం తిరువూరు పట్టణంలో శుక్రవారం జరిగింది. ఈ సమావేశానికి జిల్లాలోని వివిధ పట్టణాల మున్సిపల్ కమిషనర్లు హాజరయ్యారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి రాజమండ్రి మున్సిపల్ ఆర్జెడి నరసింహారావు మాట్లాడారు. మున్సిపల్ పరిధిలోని వివిధ పాలనాపరమైన అంశాలపై ఈ కార్యక్రమంలో ఆర్జెడి చర్చించారు. ప్రభుత్వపరమైన వివిధ కీలక అంశాలపై ఆర్జెడి కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు.