ఊటుకూరు శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా జరిగే కళ్యాణ మహోత్సవానికి ఉపయోగించే తలంబ్రాల నిమిత్తం వడ్లు వలుపు - శ్రీరాముని పిలుపు కార్యక్రమం శనివారం సాయంత్రం నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు వడ్లకు ప్రత్యేక పూజలు చేసి మహిళలకు అందజేశారు. అనంతరం మహిళలు శ్రీరామ నామం పఠిస్తూ వడ్లను గోటితో వలిచి సిద్ధం చేశారు.