తిరువూరులోని 16వ వార్డు నడిమి తిరువూరులో నూతనంగా పునర్నిర్మించిన శ్రీ దాసాంజనేయ స్వామి వార్ల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కన్నుల పండుగ గా నిర్వహించారు. ఈ నెల 6, 7, 8, 9 తేదీ ల్లో వేద పండితుల మంత్రోచరణల మధ్య విశేష పూజలు, హోమ యజ్ఞాలు జరిపారు. పాటి మీద శ్రీదాసాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట ప్రతిష్ఠ మహోత్సవం కు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఎస్సై సత్యనారాయణ ఆధ్వర్యంలో అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు.