అసెంబ్లీలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పాట పాడారు. మంగళవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను పాట రూపంలో పాడి వినిపించారు. ఆ పాటపై సహచర ఎమ్మెల్యేలు నవ్వుల వర్షం కురిపించారు.