రెడ్డిగూడెం మండలం రాఘవాపురంలో వేంచేసియున్న పెద్దమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవ వేడుకల్లో మంగళవారం మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దమ్మతల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. లోక కళ్యాణార్ధం పెద్దమ్మ తల్లి అమ్మవారికి ప్రత్యేక పూజ మహోత్సవాలు, నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో అందరు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.