విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన నిలుస్తూ ఈనెల 12వ తేదీన ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో వైయస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో యువత పోరు'నేపథ్యంలో మంగళవారం తిరువూరు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పోస్టర్లు నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామిదాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో మోసపోతున్న విద్యార్థులు, యువతకు తోడుగా వైయస్ఆర్ సీపీ నిలుస్తుందన్నారు.