రాజకీయాల నుంచి తప్పుకున్న కేశినేని నాని

79చూసినవారు
రాజకీయాల నుంచి తప్పుకున్న కేశినేని నాని
సార్వత్రిక ఎన్నికలకు ముందు వైకాపాలో చేరి ఓటమి పాలైన విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని కీలక నిర్ణయం తీసుకున్నారు. తన రాజకీయ ప్రయాణాన్ని ముగించినట్లు సోమవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. జాగ్రత్తగా ఆలోచించాకే రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. రెండు సార్లు ఎంపీగా విజయవాడ ప్రజలకు సేవ చేయడం అపురూపమైన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్