పుంగనూరులో చిన్నారి అస్పియా మృతి పట్ల శనివారం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. చిన్నపిల్ల మృతిపైనా శవరాజకీయాలు మొదలు పెట్టడం వైసీపీ నీచ నైజానికి నిదర్శనామన్నారు. మైనార్టీ మంత్రులతో కలిసి ఆస్పియ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నట్లు తెలిపారు.