రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణతో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ గురువారం సీఆర్డీఏ కార్యాలయంలో సమావేశమయ్యారు. అద్దంకి పురపాలక సంఘం అభివృద్ధిపై మంత్రి నారాయణతో చర్చించారు. అద్దంకి మిని బైపాస్ కు నిధులు కేటాయించాలని మంత్రి నారాయణను కోరారు. సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు నిధులు కేటాయించి, అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.