నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, వారి జీవితాల్లో కొత్త వెలుగులు రావాలని ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ఆకాంక్షించారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు మంగళవారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి కుటుంబం ఆర్థిక స్వావలంబన వైపు అడుగులు వేయాలంటే, ప్రతి ఇంటి నుండి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ రావాలని అందరికీ మార్గదర్శకమని అభిప్రాయపడ్డారు.