విజయవాడ: తెలుగు ప్రజల ఆత్మ గౌరవం శ్రీ పొట్టి శ్రీరాములు

61చూసినవారు
విజయవాడ: తెలుగు ప్రజల ఆత్మ గౌరవం శ్రీ పొట్టి శ్రీరాములు
తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం నిరాహారదీక్ష చేసి ప్రాణాలర్పించిన మహనీయుడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు అని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కొనియాడారు. ఆ త్యాగధనుని వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం సత్యనారాయణపురంలోని అమరజీవి విగ్రహానికి స్థానిక కార్పొరేటర్ శర్వాణి మూర్తితో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన త్యాగాలను కొనియాడారు.

సంబంధిత పోస్ట్