ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి చెల్లించాల్సిన బకాయిల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళామని ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల మీద దృష్టి సారిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నామని ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు కెవీ.శివారెడ్డి అన్నారు. ఏపీ ఎన్జీజీవో అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సమావేశం గురువారం ఏపీ ఎన్జీవో హోమ్ నందు జిల్లా అధ్యక్షుడు ఎ. విద్యాసాగర్ అధ్యక్షతన నిర్వహించారు.