విజయవాడ: అమరజీవి ఆత్మార్పణస్ఫూర్తితో సుపరిపాలన
By KOLA 60చూసినవారుశ్రీ పొట్టి శ్రీరాములు వంటి మహనీయుల స్ఫూర్తితో సుపరిపాలన అందిస్తున్నామని, సుస్థిర ప్రభుత్వంతోనే నిరంతర సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం జరిగిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.