ఈతకు వచ్చి గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన తాడేపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. విజయవాడకు చెందిన ఏం. సీతరామిరెడ్డి (58) ఉండవల్లిలోని ఫిషర్ మెన్ కో ఆపరేటివ్ సొసైటి వద్ద ఆదివారం కృష్ణా నదిలో ఈతకు వచ్చారు. ఈత కొడుతున్న సమయంలో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.