విద్యార్థులను ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దటం సమిష్టి బాధ్యత అని, విద్యార్థుల నడవడికపై తల్లిదండ్రులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణ, సంస్కారం కూడా నేర్పించాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాదు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్-టీచర్స్ సమావేశం జి. కొండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జరిగింది.