విజయవాడ నగరానికి చెందిన చాట్ల బాలు(20) అనే యువకుడు తాడేపల్లి వద్ద కృష్ణా నదిలో ఆదివారం సాయంత్రం స్నానానికి వెళ్లి గల్లంతయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన యువకుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. చీకటి పడటంతో సహాయక చర్యలు నిలిచివేశారు. బాలు ఆచూకీ కోసం కృష్ణా నది వద్ద అతని తల్లిదండ్రులు రోధనలు అక్కడున్న వారిని కంటతడికి గురిచేశాయి.