ఆదోని పట్టణంలోని స్థానిక బసాపురం రహదారిలో ఉన్న సంతోష్ పత్తి ఫ్యాక్టరీలో బుధవారం అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారం మేరకు. పత్తి ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనపై స్పందించిన ఫైర్ సిబ్బంది 3 ఫైర్ ఇంజిన్లతో చేరుకుని మంటలను అదుపు చేయడానికి ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు సమాచారం.