వల్లెలాంబదేవిని దర్శించుకున్న ఆదిమూలపు సతీష్

52చూసినవారు
వల్లెలాంబదేవిని దర్శించుకున్న ఆదిమూలపు సతీష్
కోడుమూరు పట్టణంలో వెలసిన శ్రీవల్లెలాంబదేవి జాతర ఉత్సవాల్లో మంగళవారం కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సతీష్ పాల్గొని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీలను ప్రారంభించారు. నృత్య ప్రదర్శనలో అలరించిన చిన్నారులను ఆదిమూలపు సతీష్ ప్రత్యేకంగా అభినందించారు. ఆలయ కమిటీ ఛైర్ మెన్ రఘునాథ్ రెడ్డి, రమేష్ నాయుడు, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్