మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో మూల బృందావనానికి పంచామృత అభిషేకం నిర్వహించారు. శ్రీ మఠం పీఠాధిపతి ఆధ్వర్యంలో గురువారం అర్చకులు మూల బృందావనానికి నిర్మాల్యం అనంతరం క్షీరాభిషేకం పంచామృతాభిషేకం నిర్వహించి మంగళహారతి ఇచ్చారు. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి మూల బృందావనాన్ని వివిధ రకాల పుష్పాలతో ఆభరణాలతో అలంకరించారు. స్వామికి ప్రీతికరమైన గురువారం కావడంతో భక్తుల స్వామిని దర్శించుకున్నారు.