వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్పించాలి

61చూసినవారు
వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్పించాలని ఏపీ వాల్మీకి బోయ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అర్జున్, పాండు డిమాండ్ చేశారు. ఆదివారం పెద్దకడబూరులోని వాల్మీకి మహర్షి విగ్రహం వద్ద వాల్మీకి సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో వాల్మీకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే వరకు వాల్మీకులందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఇందు కోసం ఈ నెల 22న కర్నూలులో జరిగే సమావేశానికి రావాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్