ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం

83చూసినవారు
ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం
గడివేముల మండల వ్యాప్తంగా ఉగాది పండుగను పురస్కరించుకొని మంగళవారం నాడు అన్ని గ్రామాలలో ఆయా అర్చకులు పంచాంగ శ్రవణం కార్యక్రమం నిర్వహించారు. మండల కేంద్రం గడివేములలోనీ స్థానిక చెన్నకేశవ స్వామి ఆలయం వద్ద గడివేముల గ్రామ ప్రధాన అర్చకులు కొండూరి ఆదినారాయణ శర్మ ఆధ్వర్యంలో మంగళవారం నాడు పంచాంగ శ్రవణం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఏ రాశివారికి మేలు జరుగుతుందో ప్రజలకు వివరంగా తెలియజేశారు.

సంబంధిత పోస్ట్